వ‌డ్డీ వ్యాపారుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వు: సీపీ సాయి చైతన్య

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్‌, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో ప్రజలను అధిక వడ్డీల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమంగా వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు శనివారం నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పోలీస్ డివిజన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉదయం నుండి పోలీసులు విస్తృతంగా మెరుపు దాడులు నిర్వహించారు.

ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది సంబంధిత వడ్డీ వ్యాపారుల ఇళ్లతో పాటు అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 67 ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించగా, 42 ప్రాంతాల్లో చెక్కులు, ప్రామిసరీ నోట్లు, నగదు తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారాలకు సంబంధించిన ఆధారాలపై పోలీసులు పరిశీలన చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.

వడ్డీ వ్యాపారులపై చర్యలు తప్పవు

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) మాట్లాడుతూ ప్రజల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలు వసూలు చేస్తూ , అప్పులు తీసుకున్న వారిని వేధింపులకు గురిచేసే అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధమైన వడ్డీ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు దాడులు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. అప్పుల పేరుతో ప్రజలను బెదిరించడం , బలవంతంగా చెక్కులు లేదా ఇతర పత్రాలు తీసుకోవడం, చట్టవిరుద్ధంగా అధిక వడ్డీలు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే అక్రమ వడ్డీ వ్యాపారాలపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుందని , బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. అక్రమ వడ్డీ వ్యాపారులు లేదా అధిక వడ్డీల పేరుతో వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తుల గురించి సమాచారం తెలిసినా, బాధితులుగా ఉన్నా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

Also Read : కొంగరలో భూ సర్వే పూర్తి.. పొంగులేటి కీలక ప్రకటన

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>