కొంగరలో భూ సర్వే పూర్తి.. పొంగులేటి కీలక ప్రకటన

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం, నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పరిధిలో మొత్తం 665 ఎకరాల్లో వంద శాతం భూ రీసర్వే పూర్తి చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) తెలిపారు. త్వరలోనే ఆ ప్రాంతంలో ‘భూదార్’ పట్టాల (Bhudhar Pattas) పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ అధికారులతో రాష్ట్రంలో భూ సర్వే పురోగతిపై నిర్వహించిన సుదీర్ఘ సమీక్షా సమావేశంలో మంత్రి కీలక వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రీసర్వే ద్వారా ప్రతి భూకమతానికి అత్యంత కచ్చితమైన సరిహద్దులను నిర్ధారించడంతో పాటు ప్రత్యేక సర్వే పటాలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమగ్ర ప్రక్రియ ద్వారా భూ యజమానులకు తమ యాజమాన్య హక్కులపై పూర్తి స్పష్టత లభిస్తుందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సమయంలో ఎదురయ్యే వివాదాలు, ఇబ్బందులను తగ్గించేందుకు డిజిటల్ భూ సర్వే ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

Also Read : కోహ్లీకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ.. ఏబీ షాకింగ్ కామెంట్స్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>