ఏఎంసీ అభివృద్ధిపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సూచన

కలం, కరీంనగర్ బ్యూరో: రైతులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం పనిచేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally Satyanarayana) సూచించారు. శనివారం ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ( Manakondur Agriculture Market Committee)నూతన చైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ మార్కెట్ కమిటీ సేవలను మరింత విస్తరించాలని అన్నారు. రైతులకు అవసరమైన సేవలు సులభంగా అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులంతా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల రైతులకు కూడా మార్కెట్ కమిటీ సేవలు మరింత చేరువయ్యేలా పనిచేయాలని కోరారు.

ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఏఎంసీ చైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు ఎర్రోళ్ల కవిత, తమిశెట్టి రాజేష్, రామినేని రమణయ్య, కనకం అశోక్, రాపాక రాజేశ్వర్, కుంభం చిరంజీవి, కొత్తిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మందల సంపత్ రెడ్డి, ముక్కెర సతీష్ కుమార్, ఏ. రామాంజనేయులు, దూలం వీరస్వామి, విశ్వనాథుల వీరకుమార్ , మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, మానకొండూర్, ఊటూరు పీఏసీఎస్ చైర్మన్లు నాగిశెట్టి రాజయ్య, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామశాఖల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>