కెమికల్​ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు దుర్మరణం!

కలం, వెబ్ డెస్క్​ : గుజరాత్ లోని భరూచ్ జిల్లా వాగ్రా తాలూకా సాయఖా జీఐడీసీలో ఘోర ప్రమాదం (Bharuch Factory Blast) చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇక్కడి సింజీల్ ఫార్మాకెమ్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

రసాయనాల తయారీ ప్రక్రియ వేగంగా సాగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రియాక్టర్ ధ్వంసమైంది. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ తీవ్రత ఏకంగా 15 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించినట్లు పరిసర గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీ నుంచి మిథిలీన్ క్లోరైడ్ గ్యాస్ లీకై దట్టమైన పొగ కమ్మేసింది. గ్యాస్ ప్రభావంతో కార్మికులు, సమీప వాసులు కళ్ల మంటలు, ఊపిరితిత్తుల సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు, రియాక్టర్ పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలపై విచారణ ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>