కడపలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్ల దాడులు!

కలం, వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడప (Kadapa) నగరంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. కాగితాలపెంట నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ నేతలపై కత్తులతో దాడి చేయగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాంధీ నగర్ స్కూల్ వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయాలు కావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై.. వెంటనే చెదరగొట్టారు. మూడు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. పోలీసుల తీరుకి నిరసనగా కడపలోని వైసీపీ కార్యాలయం వద్ద రోడ్డుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా బైఠాయించి ఆందోళనకు దిగారు.

రాయచోటిలో రచ్చ రచ్చ..

రాయచోటిలో టీడీపీ, వైసీపీ మధ్య మరోసారి ఘర్షణలు తలెత్తాయి. మదనపల్లి రోడ్డులో వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి జిన్నా షరీఫ్‌పై కొందరు దాడికి య త్నించారు. ఆయన కారును ధ్వంసం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు షరీఫ్‌ను సంబేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టడంతో ఎక్కడివారిని అక్కడ చెదరగొట్టారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని రాయ‌చోటిలోకి రాకుండా రింగ్ రోడ్డు చుట్టూ టీడీపీ నేతలు కాపలా కాస్తున్నారని ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>