ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి: భవేశ్ మిశ్రా

కలం, బైంసా : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్న నమ్మకం కలిగేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులను, వైద్యులను, సిబ్బందిని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector Bhavesh Mishra) ఆదేశించారు. శుక్రవారం భైంసా పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది వివరాలతో పాటు ప్రతిరోజూ నమోదయ్యే ఓపీ, ఇన్ పేషెంట్‌ విభాగంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య, అందిస్తున్న వైద్య సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వైద్యులు, సిబ్బంది నిర్ణీత సమయానికి విధులకు హాజరై రోగులకు నిరంతరాయంగా సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించిన కలెక్టర్ (Nirmal Collector).. అన్ని వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. డయాలసిస్‌ కేంద్రం, నవజాత శిశువుల విభాగం, రక్త పరీక్షల గది, మందుల గదితో పాటు ఇతర విభాగాలను సైతం పరిశీలించారు.

ఆయా విభాగాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలను సకాలంలో నిర్వహించాలని కలెక్టర్​ సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ తనిఖీలో డీసీహెచ్‌ఎస్‌ కాశీనాథ్, తహసీల్దార్ శశిభూషణ్, ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ సంతోష్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : రూ.1.50 కోట్ల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా తాయమ్మ అమ్మవారు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>