వెంగ్వాపేట్‌లో వైద్య సేవలకు కొత్త ఊతం

కలం, నిర్మల్ రూరల్ : నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ (Vengwapet) గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం (Primary Health Sub-Centre) నూతన భవనాన్ని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా నిర్మించిన ఈ భవనంతో గ్రామస్తులకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాద వనిత, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, బీజేపీ నాయకులు జమాల్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>