కలం, వెబ్ డెస్క్ : సాలూరు (Salur) మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో, ఆ టికెట్ సాధించడమే లక్ష్యంగా టీడీపీ నేత హర్షవర్ధన్ తన ప్రేయసి మంజీరను హడావుడిగా వివాహం చేసుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఆరు నెలల తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ, రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి ముహూర్తాలు చూడకుండా, బంధువులను కూడా పిలవకుండా గుడిలో హడావుడిగా తాళి కట్టేశాడు.
భార్యకు ఛైర్పర్సన్ టికెట్ తెచ్చుకోవచ్చనే ప్లాన్తో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, కూటమి సీట్ల సర్దుబాటులో సాలూరు ఛైర్పర్సన్ స్థానం జనసేన పార్టీకి కేటాయించడంతో ఆయన ఆశలు అడియాసలయ్యాయి.
Also Read : స్థానిక ఎన్నికలు సక్రమంగా జరిగేలా లేవు: అమర్నాథ్
Follow Us On : WhatsApp

