డిండి రైతులకు ఊరట.. అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు సీఎండీ హామీ

‎కలం, దేవరకొండ : డిండి రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గడంతో వ్యవసాయ బోర్లపై ఆధారపడి పంటలను కాపాడుకుంటున్న రైతులకు విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ (MLA Balu Naik) ప్రత్యేక చొరవ తీసుకున్నారు. డిండి రైతుల (Dindi Farmers) సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయన టీజీఎస్పీడీసీఎల్ సీఎండీకి ప్రత్యేక విజ్ఞప్తి చేయగా, స్పందించిన సీఎండీ అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు సానుకూలంగా హామీ ఇచ్చారు. డిమాండ్ డ్రాఫ్ట్‌లు చెల్లించి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రైతులకు పెండింగ్‌లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు.

ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను రక్షించుకునేందుకు అత్యవసరంగా అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గి బోరు బావులపై భారం పడుతున్న తరుణంలో, విద్యుత్ లోడ్ సమస్యలతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆయన సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరగా, స్పందించిన సీఎండీ రైతుల (Dindi Farmers) అవసరాలను పరిశీలించి వెంటనే ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేస్తామని తెలిపారు. పంటల సంరక్షణకు విద్యుత్ శాఖ అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు.

Also Read : తెలంగాణ విద్యుత్తు డిమాండ్‌లో సరికొత్త రికార్డు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>