కలం , యాదగిరిగుట్ట: శ్రీదేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (Yadagirigutta) అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం, ఆరవ రోజు పర్వతవర్ధిని అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఉదయం ప్రాతఃకాల పూజలు, పారాయణాలు, అర్చనలు, శ్రీదేవీ మూలమంత్ర జపాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవీ చతుషష్టి ఉపచార పూజ, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. నేడు సాయంత్రం 5 గంటల నుంచి లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు.

