సముద్రంలో తేలుతున్న ఐఫోన్లు!

కలం, వెబ్ డెస్క్: హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో భారీ కంటైనర్ నౌక మునిగిపోయినట్లు వచ్చిన సమాచారం కలకలం రేపుతోంది. వేలాది కంటైనర్లతో ప్రయాణిస్తున్న నౌక ప్రమాదానికి గురికావడంతో అందులోని ఐఫోన్లు సహా ఇతర వస్తువులు సముద్రంలో తేలుతున్నట్లు ప్రచారంలోకి వచ్చిన దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. సమాచారం ప్రకారం.. 2,500కు పైగా కంటైనర్లను తీసుకెళ్తున్న భారీ కార్గో నౌక (Cargo Ship) హార్ముజ్ జలసంధి సమీపంలో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ నేవీ వెల్లడించిన వివరాల ప్రకారం, నౌక సముద్రంలో అమర్చిన నావల్ మైన్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. నౌకలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, ముఖ్యంగా ఐఫోన్లు సముద్రంలో తేలుతున్నాయంటూ వస్తున్న వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అయితే ఈ దృశ్యాల నిజానిజాలు, నౌక(Cargo Ship)లోని సరుకు ఎంతవరకు నష్టపోయిందనే అంశాలపై స్వతంత్ర నిర్ధారణ అవసరం. గతంలో గుర్తుతెలియని ప్రాజెక్టైల్స్ దాడికి గురైనట్లు వార్తల్లో నిలిచిన నౌక ఇదేనా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. నౌక మునకకు అసలు కారణం, ప్రమాదంలో జరిగిన నష్టం, సిబ్బంది పరిస్థితిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

Also Read : సారీ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. కారణమిదే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>