పెనమలూరు ఎంపీపీ రిజర్వేషన్‌ వివాదం: వైసీపీ కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : పెనమలూరు మండల పరిషత్ అధ్యక్ష (MPP) స్థానం రిజర్వేషన్ ప్రక్రియపై వివాదం నెలకొంది. ఎంపీపీ పదవిని ఎస్టీ (ST) వర్గానికి కేటాయించినప్పటికీ, ఆ మండలంలోని ఏ ఒక్క ఎంపీటీసీ (MPTC) స్థానాన్ని ఎస్టీకి రిజర్వ్ చేయకపోవడంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని (Perni Nani) అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ అసంబద్ధ రిజర్వేషన్ ప్రక్రియపై ఆయన జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నికలు జరగని స్థానాల రిజర్వేషన్లనే ప్రస్తుతం కొనసాగిస్తున్నామని అధికారులు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.

అయితే అధికారుల వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన పేర్ని నాని, కూటమి ప్రభుత్వం కావాలనే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ రిజర్వేషన్ అంశంపై త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>