ఎల్‌నినో పరిస్థితులపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో (El Nino) పరిస్థితులు, వర్షాభావం వల్ల తలెత్తే సవాళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ నినో ప్రభావం, పంటల సాగు, విద్యుత్, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించేందుకు రేపు హైదరాబాద్‌లోని సచివాలయంలో అఖిలపక్ష సమావేశం (Telangana All Party Meeting) నిర్వహించనుంది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలతో పాటు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నింటికీ ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానాలు పంపింది. ఎల్ నినో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, నివారణోపాయాలపై అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలను ప్రభుత్వం ఈ సందర్భంగా తీసుకోనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>