ముంబై ఆంధ్ర మహాసభలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కలం, నిర్మల్: ముంబై ఆంధ్ర మహాసభ (Mumbai Andhra Mahasabha) అండ్ జింఖానాలో మహిళా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన దసరా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహాసభ ప్రాంగణంలో బతుకమ్మ ఆటపాటలతో పాటు బొమ్మల కొలువు, మహిళలకు పసుపు కుంకుమ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన ప్రత్యూష, కృష్ణవేణి బతుకమ్మ ఆటల్లో పాల్గొని, ఉత్తమ వస్త్రధారణ చేసిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, ఉపాధ్యక్షురాలు వి. శ్యామల రామ్మోహన్, కార్యదర్శి పిల్లమారవు పద్మ, సంయుక్త కార్యదర్శి గాలి స్వర్ణ, కార్యవర్గ సభ్యులు వీరబత్తిని రాజశ్రీ, బడా విజయ, తాళ్ల వనజ, వాసాల గోదావరి, ఎండూరి ప్రియంవద, భోగ జ్యోతిలక్ష్మి, ఎలిగేటి సరోజ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>