హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నీచర్ గోదాంలో మంటలు!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ (Hyderabad) లోని తప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని సబర్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం (Sabar Nagar Fire) సంభవించింది. సబర్‌నగర్‌లో ఉన్న ఫర్నీచర్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు చూస్తుండగానే వేగంగా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్ని ప్రమాదానికి గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>