కలం, వెబ్ డెస్క్: ఓట్ చోరీ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సర్ పేరుతో బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యహరిస్తుందని ఆరోపిస్తూ, జ్ఞానేశ్ వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్తో రాజీనామా చేయించకపోతే బీజేపీ ప్రభుత్వం దిగిపోవాల్సి వస్తుందంటూ విమర్శించారు.
ఓట్ల తొలగింపు ఇష్యూ కేవలం పార్టీలది మాత్రమే కాదని, దేశ ప్రజల సమస్య అని గుర్తు చేశారు. సర్ పేరుతో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ఓట్లపై కుట్ర చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జ్ఞానేశ్ రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగదని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. SIR నిలిపివేసి తొలగించిన ఓట్లను వెంటనే కలపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్, ఇతర పార్టీలు ఓటమి చెందేలా చేయడానికి మోదీ.. ఈడీ, సీబీఐలను వాడుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

