మహిళా సంఘాలకు కలెక్టర్ ఆర్థిక సాయం

కలం, ఆదిలాబాద్ : మహిళా సంఘాల (Women SHG) ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) అన్నారు. రామ్‌ల్యాం అమలులో భాగంగా ఎన్‌ఆర్‌ఎల్‌ఎం పథకం కింద బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ రూరల్ మండలం రాజర్షిషాగూడ గ్రామానికి చెందిన అర్హులైన మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పథకం అమలులో భాగంగా గొర్రెలు, మేకల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఝాన్సీ లక్ష్మీ, అంజలి మహిళా సంఘాలను గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఒక్కో గ్రూపులో నలుగురు సభ్యుల చొప్పున గుర్తించి, ఒక్కో గ్రూపునకు రూ.1 లక్ష చొప్పున, ఒక్కో సభ్యురాలికి రూ.25 వేల రుణం అందించినట్లు వివరించారు. ఈ ఆర్థిక సహాయంతో మహిళలు మేకల పెంపకం చేపట్టి, వాటిని సక్రమంగా పెంచుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ సూచించారు. మహిళా సంఘాలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో రవీందర్ రాథోడ్, ఏపీఎం అనిల్, డీపీఎం శోభా, సంబంధిత అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>