తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. దసరాకు ప్రత్యేక బస్సులు

కలం, వెబ్ డెస్క్: దసరా (Dasara) పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండుగకు 7వేల ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కరీంనగర్ జోన్ నుంచి మొత్తం 3533 బస్సులు నడుపబోతోంది. రీజియన్ల వారిగా ఆదిలాబాద్ 431, నిజామాబాద్ 719, కరీంనగర్ 1175, వరంగల్ 530, ఖమ్మం 678, హైదరాబాద్ జోన్ నుంచి 2155 బస్సులు నడుపుతుండగా, రీజియన్ల వారిగా మహబూబ్ నగర్ 645, మెదక్ 255 , నల్గొండ 815, రంగారెడ్డి 440 బస్సులను అందుబాటులో ఉంచింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి 1312 దసరా పండగ కు ప్రత్యేక సర్వీసులను నడపనుంది.

ప్రధానంగా ఈ నెల 9,10,16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. ఈ నెల 25, 26 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్​లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ (నల్ల చెరువు) , ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్​పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది.

ఈ దసరా పండుగకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.5 వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) యాజమాన్యం సవరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా దసరాకు నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ రెగ్యులర్ , స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి స్పష్టం చేశారు. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్​ను www.tgsrtcbus.in వెబ్ సైట్​లో బుక్ చేసుకోవాలని ఆయన తెలిపారు.

Also Read :  కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హరీశ్‌రావు కంచుకోటను బద్దలు కొట్టేనా?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>