ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు రెండు గ్రామాల్లో సర్వే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉండగా.. రెవెన్యూ అధికారుల సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. సర్వే నంబర్‌లో  45 ఎకరాల భూమి మిస్ అయినట్లు తెలిపారు. ఆ 45 ఎకరాలు ఎక్కడుందో తేల్చాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలి..

భూమి గుర్తింపు కోసం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు భూమి సరిహద్దులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రెవెన్యూ రికార్డులు సబ్మిట్ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. సర్వే నంబర్ 325లో ఉన్న భూమిని స్థానిక అర్హులైన రైతులకు ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

అమరవీరుల కాలనీ నిర్మాణం చేయాలి..

సర్వే నంబర్ 325లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణం చేయాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ అమరవీరుల కాలనీలో అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, సకల సౌకర్యాలతో కాలనీ ఏర్పాటు చేయాలని సూచించారు.కాలనీ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ బోర్డుకు అప్పగించాలని సూచించారు. జూన్ 2లోగా అమరవీరుల కాలనీ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>