కాచిగూడ చపల్ బజార్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రమాదం..!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చపల్ బజార్‌లో (Chappal Bazar Fire ) అగ్నిప్రమాదం సంభవించి స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ఫైర్ ఇంజిన్లు సమయానికి చేరుకోవడంతో సమీపంలోని వ్యాపార సముదాయాలు, నివాసాలకు మంటలు వ్యాపించకుండా భారీ ప్రమాదం తప్పింది.

భవన నిర్మాణ నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానిక ప్రజలు ఫైర్ అవుతున్నారు. సంఘటనా స్థలంలో అక్రమ నిర్మాణ వ్యర్థాలు, సులభంగా మంటలు అంటుకునే థర్మాకోల్ షీట్లను పేరుకుపోయినా తొలగించకపోవడం వల్లే మంటలు వేగంగా వ్యాపించాయని ఆరోపించారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా చర్యలు తీసుకోలేదని అంటున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ వేగవంతం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>