ఖమ్మం శ్రీనివాస్ నగర్ బాధితులకు బిగ్ రిలీఫ్!

కలం, ఖమ్మం బ్యూరో: ​ఖమ్మం శ్రీనివాస్ నగర్ (Srinivasa Nagar) ఇళ్ల తొలగింపు అంశంపై హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. శ్రీనివాస్ నగర్ బాధితుల తరఫున దాఖలైన పిటిషన్‌‌పై సోమవారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు, ఇళ్లు, స్థలాలు కోల్పోయి ప్రభావితమవుతున్న పేద కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి అధికారులకు ఆరు నెలల గడువు విధించింది. ​శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో ఇళ్లు కోల్పోతున్న పేదల తరఫున మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. బాధిత కుటుంబాలకు పునరావాసం, ప్రత్యామ్నాయ వసతి ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

​హైకోర్టు జారీ చేసిన ఈ ఉత్తర్వులతో శ్రీనివాస్ నగర్ నిర్వాసితులకు ఊరట లభించింది. తమ ఆవేదనను గుర్తించి న్యాయపోరాటం చేసి అండగా నిలిచిన మాజీ మంత్రి పువ్వాడకు, ఉపశమనం కలిగించే ఆదేశాలు ఇచ్చిన హైకోర్టుకు శ్రీనివాస్ నగర్ బాధితులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>