పెళ్లి చేసుకుంటానని మోసం.. యువతి నిరసన

కలం, వర్ధన్నపేట: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ యువతి సోమవారం వర్ధన్నపేట (Wardhannapet) మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ఎదుట నిరసనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుల సంఘాలు, మహిళా సంఘాలు, ప్రతిపక్ష నాయకులతో కలిసి ఆమె ఆందోళన చేపట్టారు. సారంగపాణి కుమారుడు శ్రీకాంత్ తనను ప్రేమించి, వివాహం చేసుకుంటానని ఇప్పుడు మొహం చాటేశాడని యువతి ఆరోపించారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. సదరు యువతి ఆందోళనకు కుల సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రతిపక్ష నాయకులు మద్దతుగా నిలిచారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>