కలం, నిజామాబాద్ బ్యూరో : హిమాచల్ ప్రదేశ్‌లోని మియార్ లోయలో పది మంది సభ్యుల భారతీయ యాత్ర బృందం ఒక సవాలుతో కూడిన ఎత్తైన శిఖరారోహణను పూర్తి చేసింది. ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్ బృందం, హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలోని మియార్ లోయలో ఉన్న 6,027 మీటర్ల సాంకేతిక శిఖరమైన మౌంట్ తరంగ్ II (Mount Tarang II) ను విజయవంతంగా అధిరోహించి, భారతదేశంలో మొట్టమొదటి రికార్డు సృష్టించింది.
పదిమంది సభ్యుల బృందంలో కామారెడ్డి జిల్లా కేంద్రం సరంపల్లి ఎక్స్ రోడ్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విస్లావత్ బన్నీ(Vislavath Bunny), కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా 6వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల కామారెడ్డి సందర్శించి బన్నీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్రీనివాస స్వామి బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

