టీటీడీ ఐటీఐలో అమానుషం.. విద్యార్థుల‌తోనే అన్ని ప‌నులు..

క‌లం, వెబ్‌డెస్క్: ఏపీలోని తిరుప‌తిలో ఉన్న టీటీడీ బ‌ధిర ఐటీఐ (TTD ITI)లో అమానుష ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఐటీఐలో చ‌దువుకుంటున్న బ‌ధిర విద్యార్థుల‌తో యాజ‌మాన్యం వంట‌ప‌ని, పారిశుద్ధ్య ప‌నులు చేయిస్తోంది. తాజాగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ప‌నుల కోసం విద్యార్థుల‌ను ఉద‌యాన్నే 3 గంట‌ల‌కు నిద్ర లేపుతున్న‌ట్లు తెలిసింది. వ‌స‌తి గృహంలో ఉండే 175 మంది కోసం విద్యార్థులే వంట చేయాల్సి వ‌స్తోంది. కేలం పొద్దున్నే కాకుండా మూడు పూట‌లా ఇదే తంతు కొన‌సాగుతోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మూడు పూట‌లా వంట చేస్తూ ఉంటే విద్యార్థులు ఇక చ‌దువుకునేది ఎప్పుడ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లు సిబ్బంది చేయ‌కుండా విద్యార్థుల‌తో ఇలాంటి ప‌నులు చేయించ‌డం ఏమిట‌ని మండిప‌డుతున్నారు.

విద్యార్తులు పనులు చేయ‌లేమ‌ని ఎదురుతిరిగితే తిడుతూ వారిపై దాడులు సిబ్బంది దాడులు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఈ వేధింపులపై ఇప్ప‌టికే వీడియోలు తీసి ప్రిన్సిపల్‌కి కూడా పంపిన‌ట్లు విద్యార్థులు వెల్ల‌డించారు. సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులను కూడా అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం, టీటీడీ ఎందుకు ఈ విష‌యంలో మౌనంగా ఉంటున్నాయ‌ని ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా స్పందించి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>