పాల ఉత్పత్తిలో భారత్​ అగ్రస్థానం : కిషన్​ రెడ్డి

కలం, మెదక్ బ్యూరో : ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. రాబోయే రోజుల్లో శ్వేత విప్లవంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి వద్ద 400 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న అముల్-సబర్ డెయిరీ పరిశ్రమకు ఆదివారం భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నడిబొడ్డున ఉన్న తూప్రాన్‌లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని, 400 కోట్లతో నిర్మిస్తున్న ఈ డెయిరీ ప్లాంట్ నిర్మాణం రాబోయే 18 నెలల్లో పూర్తవుతుంది. దీని ద్వారా స్థానిక యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు ఎక్కువగా వరి, పత్తి, మిర్చి, పసుపు వంటి పంటలకే పరిమితమవుతున్నారని కిషన్​ రెడ్డి చెప్పారు. అముల్ డెయిరీ పరిశ్రమ అందుబాటులోకి రావడం వల్ల భూమి లేని పేద రైతులకు కూడా పాడి పరిశ్రమ ద్వారా ఆర్థిక ఊరట లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కో-ఆపరేటివ్ సొసైటీలలో రాజకీయాలు జొరబడి వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ఆయన (Kishan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే ఈ సహకార సంఘాలను పునర్నిర్మించుకోవాలని, రైతులందరూ కలిసి కొత్త సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణలో కొత్తగా 1525 కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుందని కిషన్​ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>