బీజేపీకి అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్: సర్ ప్రక్రియను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించేందుకు ఫారం–7ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై వెంటనే ఎన్నిక సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఫారం–7 దరఖాస్తుల్లో తప్పిదాలు చోటు చేసుకుంటున్నట్లు రుజువైతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనల కంటే హైదరాబాద్‌లో చేస్తామని హెచ్చరించారు. అది జరిగితే మీరు తట్టుకోలేరని.. ఓట్ల నమోదులో అక్రమాలకు పాల్పడుతుంటే ఎంఐఎం చూస్తూ ఊరుకోబోదని బీజేపీని హెచ్చరించారు. యూపీలో మూడోసారి బీజేపీ రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని.. అందుకే పొత్తుకు అంగీకరించామన్నారు.

ఎంఐఎం నేతలపై దాడులకు కుట్ర..

ఎంఐఎం నేతలపై దాడులు చేసేందుకు చంచల్ గూడ జైలు కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. స్వయానా చంచల్ గూడ జైల్ సూపరింటెండెంట్ రూ.2 కోట్లు డబ్బులు తీసుకుని, జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీలకు బెయిల్ వచ్చేలా చేస్తున్నారని విమర్శించారు. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను హత్య చేసిన రౌడీషీటర్‌కు ఇలాగే బెయిల్ ఇవ్వడంతోనే అతను బయటకు వచ్చాడన్నారు. అమాయకులపై హత్యలకు పాల్పడేవారిని సమాజం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>