కలం, నిర్మల్ : రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాడికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అందించడమే తన లక్ష్యమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) అన్నారు. ఆదివారం భైంసా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 129 మంది లబ్ధిదారులకు రూ. 36.13 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యచికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆసరాగా నిలుస్తుందన్నారు. ముధోల్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, రాజకీయాలకు అతీతంగా అర్హులకు చెక్కులు అందిస్తున్నట్టు తెలిపారు.

