కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని 36 రైస్ మిల్లుల (Nizamabad Rice Mills)కు కాలుష్య నియంత్రణ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిజామాబాబాద్ మండలంలోని కాలూరు, ఖానాపూర్, గుండారం శివారులోని బాయిల్డ్ రైస్ మిల్లులు.. వాటి పరిసర ప్రాంతాలను కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులు తనిఖీ చేశారు. కాలుష్యం విషయంలో నిబంధనలు పాటించని మిల్లులకు నోటీసులు అందజేశారు.
అనంతరం అసోసియేషన్ ప్రతినిధులకు కాలుష్య నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పీసీబీ ఎన్విరాల్మెంట్ ఇంజినీర్ తిరుపతి మాట్లాడుతూ.. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలను బయటకు విడుదల చేయొద్దని సూచించారు. మిల్లుల్లో వ్యర్థాలను శుద్ధిచేసే ప్లాంట్లు (ETP) తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్నారు. శుద్ధిచేసిన జలాలను సొంత అవసరాలకు వాడుకోవాలని సూచించారు. కాలుష్య నియంత్రణపై సూచనలు చేశారు.

