కలం, వెబ్ డెస్క్: ఫ్లై దుబాయ్ విమానంలో వీరోచితంగా పోరాడి హై జాకింగ్ అడ్డుకుని 174 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్ఛర్‌పై (Pilot Smit Machchhar) ప్రపంచ వ్యాప్తంగా అభినందనల వర్షం కురుస్తోంది. విమానాన్ని కూల్చాలన్న కో పైలట్ దుశ్చర్యను ప్రాణాలకు తెగించి మరీ నిలువరించడంపై కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అతడు చూపిన ధైర్యానికి ప్రముఖ ఫార్మా సంస్థ మ్యాన్ కైండ్ ఫార్మా సెల్యూట్ చేసింది. పైలట్ స్మిత్ మచ్ఛర్‌కు రూ.కోటి బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. అసాధారణ ధైర్యం, మానవతా కృతజ్ఞత కింద ఆయనకు ఈ నజరానాను అందించబోతున్నట్లు ప్రకటించింది.
ప్రధానికి పైలట్ల సమాఖ్య లేఖ..
పైలట్ స్మిత్ మచ్ఛర్(Smit Machchhar)కు ప్రత్యేకంగా ధైర్య పురస్కారం ఇవ్వాలని భారత పైలట్ల సమాఖ్య ప్రధాని మోదీకి లేఖ రాసింది. 174 మంది ప్రయాణికుల కాపాడి.. దేశ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెంచారని ప్రశంసించింది. అలాంటి వ్యక్తిని ఉన్నత పురస్కారంతో గౌరవించడం మన కర్తవ్యమని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అబుదాబిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పైలట్ స్మిత్.. వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. శుక్రవారం నాడు ప్రధాని మోదీతో ఆయన వీడియో కాల్‌లో మాట్లాడి జరిగిన ఘటనను వివరించారు.
Also Read : రాష్ట్రంలో విద్య, వైద్యంపై సీఎం రేవంత్ సమీక్ష
Follow Us On: Youtube

