ఓటు హక్కు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: ప్రశాంత్ కుమార్ రెడ్డి

కలం, నారాయణ పేట: ఓటు హక్కు విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతుందని నారాయణ పేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె. ప్రశాంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు, ఓట్ల తొలగింపు ప్రక్రియకు వ్యతిరేకంగా సోమవారం కోస్గి (Kosgi) పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా (Congress Protest) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా అన్యాయంగా ఓటరు జాబితా నుంచి తొలగించకూడదన్నారు.

ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అని, ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. SIR ప్రక్రియలో పూర్తి పారదర్శకత, నిష్పక్షపాత విధానం ఉండాలని, ఓటరు పేరు తొలగించే ముందు సంబంధిత వ్యక్తికి నోటీసు ఇచ్చి తన అభ్యంతరాన్ని, వివరణను తెలియజేసే అవకాశం తప్పనిసరిగా కల్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే SIR పై ప్రజలు, రాజకీయ పార్టీలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని, ఓటర్లకు ఎటువంటి అనుమానాలు, ఆందోళనలు లేకుండా పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. తొలగించబడిన ఓటర్లకు సులభమైన, వేగవంతమైన అప్పీల్ వ్యవస్థ కల్పించాలన్నారు.

రాజకీయ పక్షపాతాలకు తావులేకుండా అందరికీ సమాన ప్రమాణాలు అమలు చేసి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయనే అభ్యంతరాలు ఉన్న చోట ప్రత్యేక పునఃపరిశీలన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓటర్ల హక్కులను పరిరక్షించేందుకు ఫిర్యాదు, అప్పీల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రసన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : భారత్-నేపాల్ సరిహద్దులో భూకంపం.. భయాందోళనలో ప్రజలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>