కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) శుక్రవారం రాత్రి భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. స్థానిక జయశంకర్ సర్కిల్, నగరేశ్వరవాడ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. స్వయంగా భక్తులకు పులిహోర ప్రసాదాన్ని అందజేశారు.
నిర్మల్ పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి గణేష్ నిమజ్జన శోభాయాత్రను తిలకించేందుకు వచ్చిన భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు. శోభాయాత్ర అనంతరం గ్రామాలకు తిరిగి వెళ్లే భక్తులు రహదారి భద్రతను పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.

