వినాయక మండపాల్లో విప్ అయిలయ్య పూజలు

కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని పలు వినాయక మండపాలను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపాల వద్ద గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని నియోజకవర్గం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు, భక్తులతో కలిసి గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వంగపల్లి గ్రామంలోని వినాయక మండపాలను దర్శించుకున్నారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>