భూ రీ సర్వేపై రైతులతో కలెక్టర్ సమావేశం

కలం, సోన్: భూముల రీ సర్వే ద్వారా ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(Collector Bhavesh Mishra) అన్నారు. శుక్రవారం సోన్ మండలం న్యూ వెల్మల్ (New Velmal) గ్రామంలో రీ సర్వే ప్రక్రియపై గ్రామస్తులు, రైతులతో గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేతో భూముల హద్దులు, హక్కులకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. న్యూ వెల్మల్ గ్రామంలో ఇప్పటికే 80 శాతం రీ సర్వే పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సర్వే సమయంలో రైతులు తమ భూముల వద్ద తప్పనిసరిగా అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలని సూచించారు. రీ సర్వేకు రైతులు అందిస్తున్న సహకారాన్ని కలెక్టర్ అభినందించారు. క్షేత్రస్థాయిలో సర్వే సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఏడీ ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ విఠల్, తహసీల్దార్ సంతోష్, సర్పంచ్ సాగర్, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>