శిలాఫలకంపై సర్పంచ్ భర్త పేరు తొలగించాలని కలెక్టర్‌కు వినతి

కలం, ​కరీంనగర్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కాచాపూర్ (Kachapur) గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఉపసర్పంచ్ లింగంపల్లి క్రిష్ణారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ​

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ… ఈ నెల 5న గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. అయితే, ఆ ప్రారంభోత్సవ శిలాఫలకంపై మహిళా సర్పంచ్ ఊకంటి మాధవి పేరుతో పాటు ఆమె భర్త ఊకంటి మధుకర్ పేరును కూడా చేర్చారని తెలిపారు. తాను వద్దని వారించినప్పటికీ అధికారులు వినకుండా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని ఆవేదన వ్యక్తం చేశారు.

​ఇది మహిళా సర్పంచ్ భర్త యొక్క ఆధిపత్య ధోరణికి అద్దం పడుతోందని, ప్రజాస్వామ్యంలో మహిళలను అణచివేసే చర్యగా భావిస్తున్నానని క్రిష్ణారెడ్డి అన్నారు. ఈ వ్యవహారంపై అధికారులు వెంటనే విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, శిలాఫలకంపై నుంచి సర్పంచ్ భర్త పేరును వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>