సమాజ అభివృద్ధిలో టీచర్ల పాత్ర కీలకం: బాద్మి శివకుమార్

కలం, జడ్చర్ల: సమాజ అభివృద్ధిలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమైనదని రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ ఛైర్మన్ బాద్మి శివ కుమార్ (Badmi Shiva Kumar) అన్నారు. ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో స్థానిక చంద్రా గార్డెన్‌లో జిల్లా, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ మిత్రమండలి అధ్యక్షులు బాద్మి శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించారు.

సమాజ వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిదని, వారి సేవలను గుర్తించి సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని బాద్మి శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఆత్మీయ మిత్రమండలి సభ్యులు మంచన విఠలయ్య, బాద్మి రవిశంకర్, ఉమ్మెత్తల మహేశ్వర్, డాక్టర్ గోపాల్, నయీముద్దీన్, అల్లంపల్లి మనోహర్, జనార్ధన్, దత్తు కుమార్, కృష్ణయ్య, విజయకుమార్, జగదీష్, లింగం పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>