కలం, వెబ్ డెస్క్: చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాబీ దర్శకత్వంలో రాబోతున్న ‘కాకా’ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘కాకా’ అంటే ఏంటనేది ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుండగా.. ఆదివారం జరిగిన ఓ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి పూర్తి పేరు చెప్పేశారు. కాకా అంటే ‘కదిరి కాళీదాస్’ అని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతూనే చిరు లీక్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
గతంలో కూడా ఆచార్య మూవీ పేరును ఇలాగే ఓ ఈవెంట్లో అనుకోకుండా చిరంజీవి చెప్పగా.. అప్పట్లో అది తెగ వైరల్ అయింది. బాబీ, చిరంజీవి కాంబోలో వాల్తేరు వీరయ్య తరువాత వస్తున్న రెండో మూవీ కావడంతో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు ఒక రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. మిడిల్ క్లాస్ మ్యాన్‌గా చిరంజీవి కనిపించిన తీరు తెగ ఆకట్టుకుంది. 2027 సంక్రాంతి కానుగా ఈ మూవీ విడుదల కాబోతుంది.
‘విశ్వంభర’ మూవీ ఎప్పుడు..?
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వంభర’ మూవీ విడుదలపై ఇంకా క్లారిటీ రావడం లేదు. పలుమార్లు వాయిదా పడుతున్న వస్తున్న ఈ చిత్రానికి ఇటీవలే ఓటీటీ సంస్థలతో ఒప్పందాలు పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో కాకా కంటే ముందే థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అదే జరిగితే రెండు నెలల గ్యాప్‌తోనే చిరంజీవి మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. వీఎఫ్ఎక్స్తో ముడి పడి ఉన్న విశ్వంభర మూవీ ఔట్ పుట్ అనుకున్న విధంగా రాకపోవడంతో కొంత భాగాన్ని మళ్లీ రీ షూట్ చేసినట్లు అప్పట్లో చర్చ జరిగింది.

