రైతుల ఆందోళన.. మంత్రికి ఎంపీ అరుణ ఫోన్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జూరాల ప్రాజెక్టు పరిధిలోని గద్వాల, ఆత్మకూరు మండలాల్లో సాగు నీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నీటిని విడుదల చేయాలని శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్‌లో విజ్ఞప్తి చేశారు. జూరాల ఆయకట్టు కింద గద్వాల, ఆత్మకూరు ప్రాంతాల్లోని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని గుర్తు చేశారు.

రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ తెలిపారు. మూడు రోజుల్లో జూరాల ప్రాజెక్టు నుంచి సాగు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. పంటలు ఎండిపోయిన తర్వాత భవిష్యత్తులో నీటిని విడుదల చేసినా ప్రయోజనం ఉండదన్నారు. ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తికి మంత్రి ఉత్తమ్ సానుకూలంగా స్పందించారు. అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>