గిరిజన పోలీస్ కోటాపై సీఎం రేవంత్‌కు బొజ్జు పటేల్ వినతి

కలం, ఖానాపూర్: ఏజెన్సీ, షెడ్యూల్డ్ ప్రాంతాలలోని గిరిజన యువత ఉద్యోగ హక్కులను పరిరక్షించడంతో పాటు పోలీస్ నియామకాల్లో వారికి తగిన ప్రాధాన్యత కల్పించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Bhojju Patel) కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గిరిజన యువత ఉద్యోగ హక్కుల అంశాన్ని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక గిరిజన యువతకు పోలీస్ శాఖలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో గతంలో అమల్లో ఉన్న 75 శాతం ప్రత్యేక రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలని కోరారు. 2026లో చేపట్టనున్న పోలీస్ కానిస్టేబుల్ నియామకాలలోనూ ఈ ప్రత్యేక రిజర్వేషన్‌ను అమలు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ, షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని స్థానిక గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వారి హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>