తెలంగాణ ఆర్టీసీలో ఎన్నికల సందడి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC)లో గుర్తింపు సంఘం ఎన్నికల సందడి నెలకొంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. అక్టోబర్ 9న పోలింగ్, 17న ఫలితాలను ప్రకటించబోతున్నారు. హైదరాబాద్ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. త్వరలోనే ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. కార్మికులు సైతం నాలుగు నెలలుగా షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకే విడుదల కావడంతో.. నెల రోజుల పాటు ఆర్టీసీలో ఎన్నికల హడావిడి నెలకొననుంది.

ఎన్నికల తరువాతే..

రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా అదే మాటకు కట్టుబడి ఉంది. అయితే, గుర్తింపు సంఘాల ఎన్నికల తరువాతనే ఆ ప్రక్రియ ఉంటుందని చెబుతూ వస్తోంది. జూన్ పదో తేదీనే ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా లేబర్ శాఖ జాయింట్ కమిషనర్ సునీతా గోపాల్‌దాస్‌ను ఎన్నికల అధికారిగా నియమించింది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. విలీన ప్రక్రియ లాంఛనమే కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>