ఉదయమే చెప్పేసిన దానం.. సాయంత్రానికి తీర్పు!

కలం, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) పదవి కోల్పోయారు. తెలంగాణ హై కోర్టు ఆయనపై అనర్హత వేటు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పును దానం నాగేందర్ ముందే ఊహించారని, అందుకు సాక్ష్యమే శుక్రవారం ఉదయం అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

దానం నాగేందర్ ఉదయం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఏం జరగబోతుందో నాకే తెలియడం లేదు.. కూల్ కూల్ అంటూ ఇంత దూరం తీసుకొచ్చారు’ అని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులపై తీవ్ర అసంతృప్తితో ఉన్న దానం నాగేందర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఇదే విషయమై మాట్లాడుతూ.. ఎన్ని సార్లు మంత్రులకు చెప్పినా కూల్ కూల్.. అంటున్నారని విచారం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>