దానంపై అనర్హత వేటు.. ‘సత్యమేవ జయతే’ అంటూ కేటీఆర్ ట్వీట్

కలం, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘సత్యమేవ జయతే!!. కాంగ్రెస్ పార్టీలో చేరిన BRS ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender)పై అనర్హత వేటు పడింది. రాష్ట్ర హైకోర్టు ఈ మేరకు నేడు తీర్పునిచ్చింది. మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా త్వరలోనే ఇదే గతి పట్టనుంది’ అంటూ పేర్కొన్నారు.

కాగా, కాసేపటి క్రితమే దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. దానం నాగేందర్ విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయాన్ని తప్పుబడుతూ..ఆయన ఎమ్మెల్యే సభ్యత్వంపై అనర్హత వేటు విధించింది. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేశారు. ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. పలుమార్లు విచారణ అనంతరం దానం నాగేందర్ పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ.. స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>