షబ్బీర్ అలీకి ఘన స్వాగతం

కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజాపాలన దినోత్సవ వేడుకల ముఖ్య అతిథి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ (Mohammed Ali Shabbir) బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పెన్‌గంగా వసతి గృహంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయనకు సాదర స్వాగతం పలికి పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్.చిత్రు, ఎస్.రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్ రావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>