కలం, ఉట్నూర్ : పత్తి పంటలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్టు ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే బుధవారం తెలిపారు. గాదిగూడ (Gadiguda) మండలం పరస్వాడ (బి) గ్రామ శివారులో కోడప మారుతి అనే వ్యక్తి పత్తి పొలంలో అక్రమంగా సాగు చేస్తున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 60 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు వివరించారు. గంజాయి సాగు, విక్రయం, రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు.

