కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027 ఆటగాళ్ల వేలానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. మూడేళ్ల తర్వాత ఐపీఎల్ వేలాన్ని (IPL Auction 2027) మళ్లీ భారత్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా వేలాన్ని భారత్‌కు తీసుకురావాలనే ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. గత మూడు వేలాలు విదేశాల్లో జరిగాయి. 2024లో దుబాయ్‌లో, 2025లో జెడ్డాలో, 2026లో అబుదాబిలో నిర్వహించారు. ఈసారి వేలం చిన్న స్థాయిలో జరగనుంది. అందుకే భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
అయితే వేలం (IPL Auction 2027) ఏ నగరంలో జరుగుతుందనేది ఇంకా ఖరారు కాలేదు. బీసీసీఐ(BCCI)కి అనుకూలమైన వేదిక అందుబాటును బట్టి నగరాన్ని నిర్ణయించనున్నారు. ఇక ఐపీఎల్‌లోని ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై కూడా కీలక చర్చ జరిగింది. ఈ నిబంధనపై జట్ల నుంచి బీసీసీఐ కొత్తగా అభిప్రాయాలు కోరింది. ఈ రూల్‌పై భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ల పాత్ర తగ్గిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ 2026కు ముందే చాలా మంది కెప్టెన్లు కూడా ఈ రూల్‌పై తమ అభ్యంతరాలను బీసీసీఐకి తెలిపారు. అందుకే ఈ నిబంధనను కొనసాగించాలా, మార్చాలా అనే అంశంపై బీసీసీఐ సమీక్షిస్తోంది. ఈ విషయంపై అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని అరుణ్ ధుమాల్ తెలిపారు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం మ్యాచ్‌లో ఏ దశలోనైనా ఒక ఆటగాడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో ఖైరుల్ మజుందార్ కూడా మరోసారి ఎన్నిక కానున్నారు. ఈ ఎన్నికలు బీసీసీఐ ఏజీఎం సందర్భంగా జరగనున్నాయి.
Also Read : రోహిత్ రికార్డు బద్దలు.. టాప్‌లోకి బట్లర్!
Follow Us On : WhatsApp

