కలం, వెబ్ డెస్క్: మియాపూర్ (Miyapur) ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో వృద్ధ దంపతులు తమ కొడుకు ఇంటి ముందు ఆందోళనకు దిగిన ఘటన కలకలం రేపింది. దేవులపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు తమను ఇంటి నుంచి బయటకు పంపించారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు, కోడలు తమను పట్టించుకోవడం లేదని, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
న్యాయం చేయాలని వేడుకోలు
తమ సొంత ఇంట్లోనే ఉండేందుకు అవకాశం లేకుండా చేశారని దంపతులు వాపోయారు. కొడుకు, కోడలు వ్యవహరిస్తున్న తీరుతో తాము తీవ్రంగా మానసిక వేదనకు గురవుతున్నామని తెలిపారు. తమకు తెలియకుండానే ఇంటిని అమ్మకానికి పెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. సమస్యను సంబంధిత అధికారులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. తమకు భద్రత కల్పించడంతో పాటు నివాసానికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : తల్లిదండ్రుల జ్ఞాపకార్థం.. రూ.కోటితో మోడల్ వైకుంఠధామం
Follow Us On: X(Twitter)

