‘ఉద్యోగుల సంక్షేమానికి దారం శ్రీనివాస్ రెడ్డి కృషి అభినందనీయం’

కలం, కరీంనగర్: ఉద్యోగుల సంక్షేమానికి టీజేఏసీ కరీంనగర్ జిల్లా చైర్మన్, టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి (Daram Srinivas Reddy) కృషి అభినందనీయం అని కరీంనగర్ (Karimnagar) జిల్లా ఎంప్లాయీస్ JAC నాయకులు, ఉద్యోగులు కొనియాడారు. JAC ఆధ్వర్యంలో దారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు టీఎన్జీవో భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంఘ నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు కలిసి దారం శ్రీనివాస్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం

ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో జీవించాలని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తున్న దారం శ్రీనివాస్ రెడ్డి (Daram Srinivas Reddy) ఉద్యోగుల ఆశాకిరణంగా నిలుస్తున్నారని అన్నారు.

ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష

ప్రత్యేకంగా CPS ఉద్యోగుల సమస్యల పరిష్కారం, OPS పునరుద్ధరణ, PRC, DA, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, EHS తదితర సమస్యలపై ఉద్యోగుల తరఫున నిరంతరం పోరాడుతూ, వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలుస్తున్నారని కొనియాడారు. కరీంనగర్ జిల్లా టీఎన్జీవోల సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ, ఉద్యోగుల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో ఉద్యోగుల హక్కుల సాధన కోసం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణ్ రావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపెల్లి కాళి చరణ్, కార్యదర్శి ఎడ్ల అరవింద్ రెడ్డి, టీఎన్జీవోల సంఘం కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మీంధర్ సింగ్, ప్రభాకర్ రెడ్డి, ఎమ్.ఎ హమీద్, రాజయ్య గౌడ్, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంతరావు, తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్, రూరల్ అధ్యక్షులు వాస్తవిక్ గౌడ్, కార్యదర్శి కొమ్మేర శ్రీనివాస్ రెడ్డి, పెన్షనర్ల సంఘం నాయకులు ఉస్మాన్ పాషా, పెండ్యాల కేశవరెడ్డి, ఎలదాసరి లింగయ్య, నాలుగవ తరగతి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్, జిల్లా నాయకులు రమేష్ గౌడ్, ప్రసాద్ రెడ్డి, ఇరుమల్ల శారద, సునీత, కరుణ, సూర్య, శైలజ, కరుణాకర్, కమలాకర్, నారాయణ, నేరెళ్ల కిషన్, సత్యనారాయణ, నరేష్ పటేల్, శంషుద్దీన్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : సుప్రీం కోర్టులో హైడ్రాకు భారీ షాక్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>