కలం, వెబ్ డెస్క్ : నానక్రామ్గూడలోని స్థల వివాదంలో సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (Kancharla Chandrasekhar Reddy)పై కేసు నమోదైంది. ఆయనతో పాటు మురళీధర్ రెడ్డి, గడ్డం రవిలపై ఓనర్స్ అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్ర కాస్మోస్ ప్రాంగణంలోకి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు అక్రమంగా ప్రవేశించి, గేటు తాళాలు పగులగొట్టి రేకుల టిన్ షీట్లు ఏర్పాటు చేశారని ఓనర్స్ అసోసియేషన్ తన ఫిర్యాదులో పేర్కొంది.
అక్కడి నిర్మాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారని, అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని భౌతికంగా తోసివేసి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని ఆరోపించారు. ఈ అక్రమాలకు పాల్పడిన చంద్రశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ సభ్యులు పోలీసులను కోరారు.

