కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల కుల గణన చేపట్టినట్లు వివరించారు. కర్ణాటక, బీహార్ వంటి రాష్ట్రాల్లో కుల గణనలు జరిగినట్లు దాన్ని సరిగ్గా టేబుల్ చేయలేకపోయారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉన్నా.. కుల గణన విషయంలో మాత్రం పకడ్బందీగా వ్యవహరించినట్లు ప్రశంసించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే.. దేశ వ్యాప్తంగా బీసీ కులగణన కచ్చితంగా చేపడుతామని వివరించారు.
కొండా సురేఖ తొలగింపు బాధాకరం..
కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగించడం తనకు కూడా బాధ కలిగించిందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కానీ, అధిష్ఠానం నిర్ణయాన్ని అందరూ ఆమోదించాల్సిందే అన్నారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి పార్టీలో అత్యంత బాధ్యత కలిగిన పదవి అన్నారు. అలాంటి పదవిలో తాను వచ్చినప్పటి నుంచి క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.

