నిర్మల్‌లో AISF ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

కలం, నిర్మల్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర, త్యాగాలు, పోరాట స్ఫూర్తిని విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో సీపీఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని జుమ్మేరాత్‌పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలు (Essay Competition) నిర్వహించారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 78వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. పోరాట చరిత్ర, అమరుల త్యాగాలు, నాటి ఉద్యమ స్ఫూర్తిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కైలాష్, నాయకులు సన్నిహిత్, నిఖిల్, శ్రీకాంత్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>