కలం, వెబ్ డెస్క్ : గురుగ్రాంలో సియా అనే మహిళా బైకర్‌ను వెంబడించి కారుతో ఢీకొట్టిన ఘటనలో ప్రధాన నిందితుడు కల్యాణ్ బైస్లా (Kalyan Baisla)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని రాజస్థాన్‌లోని దౌసా ప్రాంతంలో గురుగ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ దారుణ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేశారు. దౌసాలో పట్టుబడిన కల్యాణ్ బైస్లాను త్వరలోనే గురుగ్రామ్ కోర్టులో హాజరుపరిచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

